జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4)
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనడైనా (2)
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగి మేఘాలతొటి రాఘాల లేఖ
నీకంపినాను రావా దేవి
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా (2)
ఉండీ లేకా వున్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నా దన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4)
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
సినిమా : అంతఃపురం
సంగీతం: ఇళయరాజా
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంపాటు నిన్ను చూడక
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించనీ
అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోటకట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్న నేను నీ కోసం నువు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషంకూడా నిన్ను చూడక
సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తా డే (2)
సిరిమల్లె పువ్వా
తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందె కాడ నా చందమామ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో
సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తా డే
సిరిమల్లె పువ్వా
కొండల్లో కోనల్లో కూ యన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో
సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తా డే
సిరిమల్లె పువ్వా
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
Nuvve Nuvve - E chOTa unnA
ఏ చోట ఉన్నా
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
నేల వైపు చూసే నేరం చేసావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ బంధిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవో క్షణమై కరిగే కలవా
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల
కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటేలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా
Nuvve Nuvve - nA manasukEmayiMdi
నా మనసుకేమయింది
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
మన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని
ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ
ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ
ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటె ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటె ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని
Nuvve Nuvve - cheliyA nI vaipE vastunnA
చెలియా నీవైపే వస్తున్నా
చెలియా నీవైపే వస్తున్నా
కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా
నిద్దర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని
అందరినీ ఇలా వెంట పడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితె కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగాని
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే
Ninne Pelladata - kannullO nI rUpamE
కన్నుల్లో నీ రూపమే
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు
నా భాష ఈ మౌనమే
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకుని నేను తెగ ఎదురుచూసాను నీ తెగువ చూడాలని
చూస్తూనే వేలంత తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం
Ninne Pelladata - eTO veLLipOyiMdi
ఎటో వెళ్ళిపోయింది
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా వంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చెందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో
ఎటో వెళ్ళిపోయింది మనసు
కలలన్నవే కొలువుండనీ కనులుండి ఏం లాభమంది
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసు
Khadgam - nuvvu nuvvu
నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవిపైన నువ్వు
నా మెడ వంపున నువ్వు
నా గుండె మీద నువ్వు
ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు
ముద్దేసే నువ్వు
నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు
ప్రతి నిమిషం నువ్వు
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు
నా సైన్యం నువ్వు
నా ప్రియ శతృవు నువ్వు
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు
నా సిగ్గుని దాచుకునే కౌగిలివే నువ్వు
నావన్నీ దోచుకునే కోరికవే నువ్వు
మునిపంటితొ నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వు నువ్వు
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వు నువ్వు
మైమరపిస్తూ నువ్వు
మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకేతెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వు
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వు
Pournami - muvvalA navvakalA
మువ్వలా నవ్వకలా
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్ళేశావే
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమే
రేయికే రంగులు పూశావే
కలిసిన పరిచయం ఒకరోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చుసే నిజం నిజం కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్ళేశావే
పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరియొక జన్మగా మొదలౌతున్నదా
పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమే
రేయికే రంగులు పూశావే
Nuvve Kavali - kaLLallOki kaLLupeTTi
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు
ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం
కనులు మూసుకుని ఏం లాభం
కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా
గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
మోహమయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
నిన్నామొన్నలని నిలువెల్ల
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా
ఆకాశాన నువ్వు ఎటువున్నా
చినుకులా కరగక శిలై ఉండగలవా
Nuvve Kavali - ekkaDa unnA
ఎక్కడ ఉన్నా
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ
నేను కూడ నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
నిద్దర తుంచే చల్లని గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటున
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలి నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కద
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడ అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
Nuvve Kavali - anaganagA AkASaM
అనగనగా ఆకాశం ఉంది
అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టాయ్యింది
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి
ఊగే కొమ్మల్లోన చిరుగాలి ఖవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వింతగా
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నువు చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి
చుక్కల్లోకం చుట్టు తిరగాలి అనుకుంటు ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటు ఓ తార నాకోసం వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్ళకి సరిపోయే ఆశలని పండించగా
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
Nee Sneham - vEyi kannulatO
వేయి కన్నులతో
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవ నేస్తమా
నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా
Manasanta Nuvve - tUnIga tUnIga
తూనీగా తూనీగా
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక
దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగ
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాక
దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా
సూర్యుడినే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడు
ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓసారటువైపెళుతుంది
మళ్ళి ఇటువైపొస్తుంది
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాదెలా
కూ కూ బండి మా ఊరుంది
ఉండిపోవె మాతో పాటు
Manasanta Nuvve - ceppavE prEma
చెప్పవే ప్రేమా
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఎపుడో ఒక నాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని
ఇపుడూ నిను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని
నేస్తమా నీకు తెలిపేదెలా
ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగినా
నిను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా
Varsham - kOpamA nApaina
కోపమా నాపైన
కోపమా నాపైన ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
చాలులే నీ నటన సాగవే ఇటుపైనా
ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనె లలనా
దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైన
మన దారులు ఎప్పటికైనా కలిసేనా
కస్సుమని కారంగా కసిరినది చాలింక
ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడదాక కలిసి అడుగేయవుగా
కనుల వెనుకే కరిగిపోయే కలవి గనుక
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
నువు గొడుగును ఎగరేస్తావే జడివానా
తిరిగి నిను నాదాక చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియవమ్మా చెరిపినా చెరగవుగనుక
సులువుగా నీలాగా మరచిపోలేదింకా
మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక
ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా
Varsham - mellagA karaganI
మెల్లగా కరగనీ
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుల వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
నీ మెలికలలోన ఆ మెరుపును చూస్తున్నా
ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిను విడదా
ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైనా
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులువేయనా
మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా
Varsham - nuvvostAnaMTE nEnoddaMTAnA
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
సినుకు రవ్వలు సినుకు రవ్వలు
సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులు
పంచవన్నె చిలకలల్లె వజ్జరాల తునకలల్లె
వయసు మీద వాలుతున్న వాన గువ్వలు
ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా!
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ముక్కునులికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా జూకాల్లాగ చేరుకోవే జిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగ కాలికి మువ్వల పట్టీల్లాగ
మెడలో పచ్చల పతకంలాగ
వగలకు నిగ నిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
చిన్ననాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా
కన్నె ఏటి సోయగంలా నన్ను నీతో పోల్చుకోనా
పెదవులు పాడే కిళ కిళ లోన
పదములు ఆడే కథకళి లోన
కనులను తడిపే కలతల లోన
నా అణువణువున నువు కనిపించేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
Khadgam - musugu veyyoddu
ముసుగు వెయ్యొద్దు
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో
ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా
సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా
అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు
కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా
నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం
సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం
Chakram - jagamaMta kuTumbaM
జగమంత కుటుంబం
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లని
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి
Khadgam - OMkAra nAdaMtO
ఓంకారనాదంతో
ఓంకారనాదంతో అంకురించిన వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం
హ్రీంకారనాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం
యుగయుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం
తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం
తన కళ్ళ ముందే సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైనా
క్షణమైనా తన గాథ గతములో విడిచి ధ్రుతి ఒడి చేరనిదీ ఖడ్గం
ఊటతో పడమరను దాటి పూర్వార్ధిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ భరత ఖడ్గం
కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం
మూడువన్నెల కేతముగ మింటికి ఎగసి కాలానికెదురేగు యశోరాశి ఈ ఖడ్గం
హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం
నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తిమార్గం
ఆర్తరక్షణకై ధరించిన ధీరగుణమీ ఖడ్గం
ధూర్తశిక్షణకై వహించిన కరకుతనమీ ఖడ్గం
హూంకరించి అహంకరించి అధిక్రమించిన ఆకతాయిల అంతు చూసిన క్షాత్రసత్వం
అస్తమించని అర్థఖడ్గం
శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన అన్ని జాతుల పొదువుకున్న ఉదారతత్వం
జగతి మరువని ధర్మఖడ్గం
నిద్దుర మత్తును వదిలించే గెంజాయల జిలుగీ ఖడ్గం
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం
గెంజాయల జిలుగీ ఖడ్గం
తెలతెల్లని వెలుగీ ఖడ్గం
సిరిపచ్చని చిగురీ ఖడ్గం
Manmadhudu - nEnu nEnugA lEnE
నేను నేనుగా లేనే
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా
చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేని నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
Murari - alanATi
అలనాటి
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెనుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందామామ చందామామ కిందికి చూడమ్మా
ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెలబోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళకళ జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షతలేయండి
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకుని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడుగక బంధువులంతా కదలండి
ApadbAndhavuDu - ourA ammakachellA
ఔరా అమ్మకచెల్ల
అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు జాడలేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యేడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల
ఔరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీలా
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
నల్లరాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణజానపదాలతో ఙానగీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
ఆలమందకాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాల
తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా.
Vaana - eduTa niliciMdi cUDu
ఎదుట నిలిచింది చూడు
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా
నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
ఔనో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా
నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందొ నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా
*************************
వెంట పడుతుంది చూడు
కనపడని మంట ఏదో
బదులు అడిగింది నేడు
వినపడని విన్నపమేదో
మది మునిగిపోయే మత్తులో
మధురమైన యాతనేదో బైటపడదెలా
Jalsa - Ye Zindegi
యే జిందగీ నడవాలంటే
యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాట అనుకో తమాషగా తల ఊపి
Varietyగ శబ్దం విందాం అర్ధం కొద్దిగ side కి జరిపి
అదే మనం తెలుగులొ అంటే dont worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైనా అమృతం
కష్టం కూడ అద్భుతం కాదా
Botanicalభాషలో petals పూరేకులు
Material science లో కలలు మెదడు పెనుకేకలు
Mechanicalశ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle
పొందాలంటే victory పోరాటం compulsory
Risk అంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే historyలిఖ్ నా
Utopia ఊహలో అటో ఇటో సాగుదాం
Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophyచూపులో ప్రపంచమో బూటకం
Anatomy labలో మనకు మనం దొరకం
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle
alsa - Ni Payanam Ekkadiko
నీ పయనం ఎక్కడికో
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం
ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
Ela Cheppanu - Ee Kshanam
ఈ క్షణం
ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగ
కరగని దూరములో
తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్నే నీవు వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది
మళ్ళి నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక ఆరాటంగ కొట్టుకున్నది
రెప్పవేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చజెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని
ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది
Subhakankshalu - Gunde Ninda
గుండె నిండా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా
నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా
నిలువదు నిముషం నువు యెదురుంటే
కదలదు సమయం కనపడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వెశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఎన్నెన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని
ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగా మార్చెస్తుందమ్మా
గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్రాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
Subhakankshalu - Manasa Palakave
మనసా పలకవే
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై
మంచుతెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా
తుమ్మెద తుమ్మెద విన్నావమ్మా నిన్ను ఝుమ్మంటు రమ్మంది రంగేళి పూవమ్మా
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై
నాలో కులుకుల కునుకును రేపి
లోలో తెలియని తలపులు రేపి
పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది
నీలో మమతల మధువుని చూసి
నాలో తరగని తహతహ దూకి
నీకై గలగల పరుగులు తీసి చేరే వేగమిది
ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా
ఎడేడు జన్మాల బంధాలతో ఈ నాడు నీ ఈడు పండించనా
మరి తయ్యారయ్యే ఉన్నా వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా
దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా చిన్నారి వన్నెల్ని ఏలంగా
ప్రతిక్షణం పరవశం కలగగా
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై
ఆడే మెరుపుల మెలికల జానా
పాడే జిలిబిలి పలుకుల మైనా
రాలే తొలకరి చినుకులలోనా తుళ్ళే తిల్లానా
వేగే పదముల తపనలపైనా
వాలే చినుకుల చెమటల వానా
మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళానా
బంగారు శృంగార భావాలతో పొగారు ప్రాయాన్ని కీర్తించనా
అందాల మందారహారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా
ఇక వెయ్యేళ్ళైనా నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా
ఇక వెళ్ళాలన్నా ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా
కాలమే కదలక నిలువగా
Nee Sneham - chinuku taDiki
చినుకు తడికి
చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలె మనసుపడు పాదమా
ఊహలె ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా ఆ ఆమని మధువనమా
సరిగస సరిగస రిగమదని సరిగస సరిగస నిదమ దని
సస నిని దద మమ గమదనిరిస గ
నినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గస గ
పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడొ ఏమొ బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మ
పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా
సగమగ రిస సనిదమగ సగ సగమగ రిస సనిదమగ
సగస మగస గమద నిదమ గమదనిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గగ నిని గగ నిని దగ నిగ సప
వరములన్ని నిను వెంటబెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నవే కుందనాల బొమ్మా
సిరుల రాణి నీ చేయిపట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ రాముని సుమ శరమా ఆ రాముని సుమ శరమా
Nuvvostanante Nenoddantana - ghal ghal
ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
కొత్త బంగారు లోకం
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...2
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం..
నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులోన అడుగులు వేస్తూ..
నడిచిన దూరం ఎంతో ఉన్నా..
అలసట రాదు గడచిన కాలం ఎంతని నమ్మరు గా..
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె..
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె..
ఈ వరాలుగా ఉల్లసమై కురుస్తూ ఉంటె..
పెదవకి చెంప తగిలిన చోట..
పరవశమేదో తోడవుతుంటె...
పగలే అయిన గగనం లోన తారలు చేరెను గా..
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...2
No comments:
Post a Comment